నమస్తే-1
అది అండి అప్పుడెప్పుడో వర్డుప్రెస్సు లో బ్లాగు ఒకటి స్టార్ట్ చేస్న కానీ ఏం రాయలో!?? ( సారీ బద్ధకం!?? సారీ అంత టాలెంట్ !? ) అర్ధం కాక ..??
ఏదో ఒకటి లెండి ఇప్పుడు మళ్లీ ఫ్రెష్ గా బ్లాగ్స్పాట్ లో మొదలెట్టా,
అసలు అప్పటికి ఇప్పటికి లైఫ్ లో చా..........లా........ చేంజెస్ వచ్చినయ్ సో ఇలా కొత్తగా అన్నమాట (అక్కడ పెద్ద రాసింది లేదు ఏం లేదు కానీ..)
అసలు ఈ మద్య ఏం రాస్తున్నరు నిజంగా, తెలుగు బ్లాగుల స్టాండర్ద్స్ ఎక్కడో ఉన్నయ్, చాలా frequent గ కుడ రాస్తున్నరు,
అప్పుడు కూడలి రెండు మూడు రోజులకు ఒక సారి చూస్తే సరిపొయేది ఇప్పుడు సగం టైం అంతా కూడలి కే పోతుంది :-(
ఎవరో అన్నట్టు ఇదొక ఆరోగ్యకరమైన వ్యసనం :-)
హ్మ్మ్ ఇంకా..
ok నా గురించి చెప్పాలంటే చా....లా...ఉంది, తెలుస్తుంది లెండి ముందు ముందు మీకే,
మన సాంబార్ ఎడారి లో మొన్నే ఓ మూన్నెళ్ల కింద ఓ చిన్న ఒన్ సెక్ చిన్నదా? పెద్దదా ?
okay మిడ్ సైజ్ కంపని లో జాయిన్ అయ్యా (fresher..ఇంకా ఖరాబ్ కాలే ;-))
ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది (అబ్బో..)
ఏంటో training అని అన్నరు కంప్యూటర్ లు ఇచ్చిన్రు, జనాలు ఎమో పండగ చేస్కుంటున్నరు నేనెమో ఇలా కూడలి మీద పడ్డ..ఎటు పోద్దెమో లైఫు :-(
రాధిక said...
:)
July 15, 2008 at 4:18 AM